GET THE SOFTWARE JOBS IN MNC COMPANIES!!!


సాధారణంగా సెప్టెంబర్ నెల నుంచి క్యాంపస్ నియమాకాలు మొదలవుతాయి. కానీ, ఈసారి దానికి భిన్నంగా ఆగస్టు చివరి వారల నుంచి ఈ సందడి కనిపిస్తుంది. ఇప్పటికే TCS, COGNIZANT, IBM, TECH MAHINDRA, POLARIS, WIPRO లాంటి సంస్థలు క్యాంపస్ నియామకాలకు పచ్చజెండా ఊపాయి. పేరున్న కళాశాలల్లో ఇప్పటికే ఒకటి రెండు కంపెనీలు అభ్యర్ధులను ఎంపిక చేసుకున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని నియామకాలు ఖశ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. దానికి ఇప్పటినుంచే ప్రిపేర్ అయితే బావుంటుంది.

ఈ కాంపిటీషన్ యుగంలో SOFTWARE కొలువు సాధించడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారమే. అయితే పట్టుదల, ప్రణాళిక ప్రకారం విశ్లేషణాత్మకంగా చదివితే సాఫ్ట్ వేర్ కొలువును సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటికే ఈ సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు ఉద్యోగాల వేట మొదలు పెట్టారు. కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయ్యారు. మరో వైపు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న బ్యాచ్ చివరి సెమిస్టర్ ప్రాజెక్ట్ వర్క్ లో ఉన్నారు. వీరు కూడా మరికొద్ది రోజుల్లో 2015 బ్యాచ్ వారికి జతకానున్నారు.

ముఖ్యంగా ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ వీరందరినీ ఫ్రెషర్స్ గా ఉద్యోగాల్లోకి తీసుకోనున్నాయి. అయితే ఉద్యోగ సంస్థలు ఆశించే నైపుణ్యాలున్న అభ్యర్ధుల కోసం వడపోత తప్పనిసరిగా ఉంటుంది. PRELIMINARY ROUND, TECHNICAL ROUND, HR ROUND ఉండే అవకాశం ఉంటుంది. కంపెనీ విధానాలను బట్టి ఒకటి రెండు ఎక్కువ రౌండ్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని కంపెనీలు గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించే అవకాశం ఉంటుంది.

మరి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి..
సీనియర్ల సలహాలు ..

క్యాంపస్ నియామకాలను ఎలా ఎదుర్కోవాలో సీనియర్లు, మీ ఆత్మీయుల సలహాలను తీసుకోండి. తద్వారా కొంత భయం పోతుంది. ఎలా ఎదుర్కోవాలనే దాని మీద స్పష్టత వస్తుంది. ఎలా చదవాలో వారు గైడ్ చేయగలుగుతారు. మీకంటే ముందే ఆయా రంగాల్లో అడుగుపెట్టి ఉంటారు కాబట్టి చాలా విషయాలు వారినుంచి తెలుసుకోవచ్చు. ప్రాథమిక పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసుకోండి. ఇప్పుడు దాదాపు అన్ని సంస్థలూ ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అంటే ఒకరు రాసిన ప్రశ్నాపత్రం మరొకరికి రాదు. ఒకే రోజు స్లాట్ ల వారీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని సంస్థలు మూకుమ్మడిగా పరీక్షను ఆఫ్ లైన్ లో నిర్వహిస్తున్నారు. ప్రశ్నాపత్రాలు, ప్రశ్నల సరళిని తెలుసుకోవాలంటే, ఇందుకు సంబంధించి ఇంటర్నెట్ లో బోలెడు సమాచారం ఉంటుంది. వాటన్నింటినీ క్రోడీకరించి, వాటి అవగాహనతో సొంతంగా పరీక్షకు సన్నద్ధం కావాలి.

ఇంటర్వ్యూ..

ఫ్రెషర్స్ ప్రాథమిక పరీక్ష నెగ్గినా, ఇంటర్వ్యూను నెగ్గుకు రాలేకపోతున్నారు. దీనికి ఇంటర్వ్యూ అంటే భయం ఓ కారణంగా చెప్పవచ్చు. అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పగలగాలి. ఎంత నాలెడ్జ్ ఉన్నా, ప్రజెంట్ చేయడంలోనే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం మాక్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. ఇలా ఇంటర్వ్యూకు సన్నద్ధం అవుతే సులువుగా TECHNICAL ROUND లో విజయం సాధించగలుగుతారు. అలాగే HR ROUND లో నెగ్గుకు రావాలంటే, ముందే సంబంధిత కంపెనీ స్థితిగతుల గురుంచి తెలుసుకుని వెళ్ళడం ఉత్తమం.

ఈ విధంగా ప్రయత్నిస్తే మీకు విజయం దాసోహం అవ్వక తప్పదు. సో ఫ్రెండ్స్.. బి ప్రిపేర్. ఆల్ ది బెస్ట్.


More Details: Click Here

Register For Latest Jobs : Click Here
Share on Google Plus

About ravindra

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment