సింగరేణి కాలరీస్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి భారీ స్పందన వస్తోంది. 471 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం సింగరేణి కాలరీస్ నోటిఫికేషన్ విడుదల చేయగా, ఏకంగా 90 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోన్నారు, వీరిలో 84 వేల మంది అభ్యర్థుల దరఖాస్తులను అర్హమైనవిగా సింగరేణి సంస్థ వెల్లడించింది. దీంతో ఒక్కో పోస్టుకు సుమారు 1,700 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. త్వరలోనే ఆన్ లైన్ లో హాల్ టికెట్లను జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఉద్యోగాలకు అభ్యర్ధుల ఎంపిక కోసం వచ్చే నెల 11న సింగరేణి పరిధిలోని నాలుగు జిల్లాలతో పాటు హైదరాబాదులో కూడా రాత పరీక్షను నిర్వహించేందుకు సింగరేణి కాలరీస్ సన్నాహాలు చేస్తోంది. కాగా పలు టెక్నికల్ పోస్టుల భర్తీకి సింగరేణి సంస్థ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
For More Details: Click Here
For More Govt Jobs: Click Here

0 comments:
Post a Comment