BREAKING NEWS:: RRB Exams Now Conducting In Online



రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు ఇకపై ఆన్లైన్ పద్దతిలో జరుగుతాయి. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసారు. ఇప్పటివరకు ఉన్న మాన్యువల్ విధానం అభ్యర్థుల్లో , ప్రజల్లో చాలా సందర్భాల్లో చివరికి ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న అధికారుల్లో సైతం విశ్వాసాన్ని పాదుకొల్పడంలో విఫలమైందని ఆయన అన్నారు. నిర్ణీత కాల వ్యవధిలో ఎలాంటి తప్పులూ జరగకుండా ఉండడానికి అవసరమైన రక్షణలతో ఆన్లైన్ విధానాన్ని అమలు చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ‘రిక్రూట్మెంట్ ప్రక్రియను మెరుగుపర్చడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ అభ్యర్థులు, ప్రజలు, చివరికి చాలా సందర్భాల్లో సంబంధిత అధికారుల్లో విశ్వాసాన్ని పాదుకొల్పడంలో అది ఇప్పటికీ విఫలమవుతోంది’ అని ప్రభు అభిప్రాయ పడ్డారు.ప్రస్తుతం రైల్వే రిక్రూట్మెంటు బోర్డులు, రైల్వే రిక్రూట్మెంట్ సెల్లు రాత పరీక్షలను నిర్వహిస్తున్నాయి. ఈ పరీక్షల్లో అభ్యర్థులు ప్రశ్నలకు సమాధాన పత్రాల్లో జవాబులు రాయాల్సి ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో ప్రశ్నపత్రాలు లీక్ కావడం వల్ల పరీక్షలను రద్దు చేయాల్సి వస్తోందని రైల్వే శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అందువల్లనే మంత్రి పరీక్షతో సహా మొత్తం రిక్రూట్మెంట్ ఫ్రక్రియను ఆన్లైన్లోనే జరపాలని నిర్ణయించారని ఆయన చెప్పారు.

For More Information: Click Here
Share on Google Plus

About venky

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment